Wednesday, 4 November 2026

రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే… పేదలకు అండగా ఉంటుంది : టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి

జనం సాక్షి/ కొల్చారం :అధైర్య పడకండి… అండగా మేమున్నాం… రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే  అంటూ నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఆవుల రాజిరెడ్డి  కొల్చారం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వివిధ కారణాలతో చనిపోయిన కుటుంబాలను మంగళవారం ఓదార్చారు. కొల్చారం మండల పరిధిలోని న్యాయం నాయిని జాలాల్ పూర్ తండా, పోతరెడ్డి పల్లి తండా, కిష్టాపూర్, ఎనగండ్ల గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలచే నలుగురు మృతి చెందారు. వీరికి ప్రభుత్వపరంగా ఏమైనా ఆర్థిక సహాయం వచ్చిందా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన సొంతంగా నాలుగు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చారు. కుటుంబీకుల్లో మనోస్థైర్యాన్ని నింపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్, కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్లుగారి గ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ మాజి చైర్మన్ నాయిని లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగసాని మహేశ్వర్ రెడ్డి, గోవర్ధన్, ప్రవీణ్ రెడ్డి,యేసు రాజు తదితరులు ఉన్నారు.