Tuesday, 3 November 2026

బిజెపి విజయం అభినందనీయం: పవన్‌

విజయవాడ,నవంబర్‌11(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం అభినందనీయమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. మోదీ నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. ఎన్డీఏ కూటమి మరోమారు బిహార్‌ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఆలోచింపచేశాయన్నారు.