భువనగిరి రూరల్ , జులై 3 (జనం సాక్షి)యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో బిజెపి శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన పనులు వివరిస్తూ ప్రధానమంత్రి కల్యాణ యోజన, స్ఫూర్తి అంత్యోదయ స్ఫూర్తి, సోమనాథ్ కేదార్నాథ్ ఆలయాల పునరుద్ధరణ, రైతుల సంక్షేమానికి పెద్దపీట, మధ్య తరగతి కుటుంబాలకు సులభతర జీవితం ,అందరికీ ఆరోగ్యకరమైన జీవితం, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల రైతులకు ఆర్థిక సహాయం, ఫసల్ భీమా యోజన, ఎయిమ్స్, మెడికల్ కాలేజీలు యువతకు కౌషల్ యోజన శిక్షణ , నగరాల్లో మెట్రో రైలు సౌకర్యం ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం, కేంద్రం చేసిన వివిధ పథకాలను వివరిస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ ప్రజలకువివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కణతాల అశోక్ రెడ్డి, మట్ట ఆంజనేయులు, రావి సత్యనారాయణరెడ్డి, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు టి.రాములు, గాదె శేఖర్, గ్రామ శాఖ భూత్ అధ్యక్షులు వెంకట చారి, కోశాధికారి హరిష్ చారి, కార్యవర్గ సభ్యులు జక్కా నర్సిరెడ్డి, మనీష్ రెడ్డి , పోతుల శ్రీనివాస్ సాయికుమార్ , ఎలిమినేటి రాజేందర్ రెడ్డి,కొత్త ప్రణయ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు





