Tuesday, 3 November 2026

శ్రీ మడేలేశ్వర స్వామి, సీతాలమ్మ తల్లి, ఈదమ్మ దేవర లకు ఘనంగా బోనాలు. గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

డోర్నకల్ జూలై 2 జనం సాక్షి న్యూస్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో ఆదివారం రజక సంఘం కుల పెద్దల ఆధ్వర్యంలో డప్పు సప్పులతో ఆడపడుచులు బోనాలు ఎత్తి గొల్లచర్ల గ్రామ శివారు చెరువు కట్టపై కొలువై ఉన్న రజకుల కుల దైవమైన శ్రీ మాడేలేశ్వర స్వామి, సీతలాంబ దేవి, ఈదమ్మ దేవర దేవతలకు బోనాలతో ఊరేగింపుగా వచ్చి ఘనంగా బోనాల సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక గ్రామ సర్పంచ్ చేరెడ్డి సమ్మిరెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్షం రెడ్డి, మాజీ జెడ్పిటిసి గొర్ల సత్తిరెడ్డి పాల్గొని శ్రీ మడేల్లేశ్వర స్వామి వారిని కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. గ్రామంలో ప్రజలు, రజకులు ఆయురారోగ్యాలతో పశు సంపద,పాడిపట్టాలతో పచ్చగా సుభిక్షంగా ఉండాలని రజక సంఘం నాయకులు కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ స్వామివారిని ముక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొడవండ్ల ప్రేమ్ కుమార్,రజక సంఘం గ్రామ అధ్యక్షుడు కొడవండ్ల సైదులు, కార్యదర్శి కొడవండ్ల వెంకన్న, కోశాధికారి కొడవండ్ల శ్రీను, రజక సంఘం సభ్యులు కొడవండ్ల చిన్న సైదులు, నాగయ్య, చిక్కుల వెంకన్న,సురేష్ బాబు,వేణు, గూడూరు వెంకటేశ్వర్లు, సైదులు, వార్డు మెంబర్లు,గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.