పెనుబల్లి, ఏప్రిల్, జనం సాక్షి-దేశంలొ భారతీయ జనతా పార్టీ మతం ముసుగులో ప్రజలను విడకొడుతుంటే, మరోవైపు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సొమ్మును దొచుకొంటుందని ఏ ఐ సి సి సభ్యులు, టి పి సి సి సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి సంభా ని చంద్ర శేఖర్ అన్నారు,నియోజకవర్గంలో 31వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా బుదవారం పెనుబల్లి మండలపరిధిలోనిలింగగూడెం, పార్థసారథిపురంగ్రామంలో బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, అభివృద్ధి ప్రదాత సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇంటి ఇంటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు, కార్యక్రమంలో పార్టీతోనే అభివృద్ది సాధ్యమని రాహుల్ గాంధీ సందేశపత్రముతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్ ప్రజలకు అందజే సారు, ఈ సంధర్భంగా ఆయన మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడురైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందని,నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశం మొత్తంమీద ఒకేసారి ఆంక్షలులేని రుణమాఫీచేయడం జరిగిందని,ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిందని,పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే నని అన్నా రు,అమ్మ హస్తం ద్వారా రేషన్ షాపు లో 9 రకాల నిత్యావసర సరుకులుఅందించడంజరిగిందని అన్నారు,108,104 అంబులెన్స్ సేవలు జలయజ్ఞం కింద ఎత్తిపోతల పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలుచేసిందన్నారు,ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చినది అన్నారు,హస్తానికి 5వేళ్లు లాగా అధికారంలోకి రాగానే ప్రజలకు 5మేళ్లుచేయడం జరుగుతుందని అవిఏకకాలంలో రైతు రుణమాఫీ 2 లక్షలు,ఆడబిడ్డలకు రూ. 500కి గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సాయం,ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ 5000,మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీచేస్తామన్నారు,పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, స్టేట్ ఎస్ సి డీ పి టి కన్వీనర్ కొండూరు కిరణ్, దేవేంద్ర బాబు, కాకా వెంకటేశ్వర్లు, మేకతొట్టి కాంతయ్య, గోగినేని రమేష్, జిల్లేళ్ళ నరసింహాస్వామి, బెల్లంకొండ సీతారాములు, బొర్రా శ్రీనివాసరావు (బాబు), బొప్పన మోహనరావు, వాణీపతిరావు, బొర్రా రవి, వేముల నరసింహారావు, పద్ధం శివ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




