Wednesday, 4 November 2026

 రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ని అడ్డుకుంటాం..

వరంగల్ బ్యూరో, జూన్ 16 (జనం సాక్షి) వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ జిల్లా పోచమ్మైదన్ రత్న హోటల్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించగా పిసిసి సభ్యులు,పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఇనగాల వెంకట్రామ్ రెడ్డిపాల్గొనిమాట్లాడుతూ…వరంగల్ టెక్స్ట్ టైల్స్ పార్క్ లో భూములు కోల్పోయిన రైతులకు 100 గజాల ఇంటి స్థలం తో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తానాని నేటి వరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తిరును ఖండిస్తున్నామని,పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతులను పట్టించుకోవడం లేదని,రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఎకరానికి 9లక్షల 95 వేయిల తో కొనుగోలు చేసి,ఎకరానికి కోటి రూపాయలకు అమ్మకాలు చేపట్టడం సిగ్గుచేటు అని తీవ్రంగా మండి పడ్డారు,అక్రమ మొర్రం అమ్మకాలు రైతులు గమనిస్తున్నారు అని రాబోయే ఎన్నికల్లో గీసుగొండ,సంగెం మండలాల రైతులు ఈ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెపుతారు అని విమర్శించారు, ధాన్యం కొనుగోలు చేసి వారాలు గడుస్తున్నా రైతులకు ఇంత వరకు వారి ఖాతాలో డబ్బులు జమ కావడం లేదని అన్నారు,పంట నష్ట పోయిన రైతులకు కెసిఆర్ ఇస్తానన్న 10000 లా రూపాయలు ఇంతవరకు ఇవ్వకపోవడం సిగ్గు చేటు అన్నారు,ఈ సమస్యల అన్నిటిపై కె టి ఆర్ సమాధానం చెప్పాలి అని ఇనగాల గారు డిమాండ్ చేసారు రాష్టంలో రైతులకు ఇచ్చిన హామీలు కెసిఆర్ నెరవేర్చలేదు అని తెలిపారు,రైతు రుణమాఫీ,ఉచిత ఎరువులు,పంట నష్ట పరిహారం ఇలా ఎన్నో వాగ్దాలు చేసి మై మర్చిపోయారని అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కె టి ఆర్ పర్యాటను ని అడ్డుకొని తీరుతాం అని అన్నారు..ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ వరంగల్ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య ,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు అయూబ్,వర్దన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నమిండ్ల శ్రీనివాస్,మహిళా కాంగ్రెస్ నాయకురాలు,జిల్లా ఎస్సి సెల్ వైస్ చైర్మన్ దుపాకి సంతోష్,15వ డివిజన్ అధ్యక్షులు ఎల్లగొండ ప్రవీణ్,నమ్మిండ్ల కిల్మెట్, ల్యాదేల్లా ఆనందం,తాటికాయల కిష్ణం రాజు,చందు రవి,మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు,జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…