Tuesday, 3 November 2026

బి ఎస్ పి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

బి ఎస్ పి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
అశ్వారావుపేట, జనవరి 4( జనం సాక్షి ) అశ్వరావుపేట లో
బి ఎస్ పి పార్టీ ఆధ్వర్యాన
బుధవారం నాడు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీ ఎస్ పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్ దొర మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా బి ఎస్ పి పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హ్యాక్ చేస్తున్నాయని ఇటువంటి
నేరంపై సుప్రీం కోర్టు జడ్జితొ ఉన్నత స్థాయి విచారణ జరిపించాలనీ డిమాండ్ చేశారు అశ్వారావుపేట అసెంబ్లీ మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ హ్యాకింగ్ కు వ్యతిరేకంగా ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.బిఎస్పీ మండల కన్వీనర్ జక్కుల చిన్న అధ్యక్షతన నిర్వహిచారు.
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల గొంతుకై లిక్కర్ స్కాం గురించి ,బీసీల వాటా తెల్చమన్నందుకు, బీసీ,ఎస్సి, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచమన్నందుకు, కాంట్రాక్టులలో బహుజనులవాటా ఎదని, నిరుద్యోలుగులకు తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగాలు, ఎందుకివ్వరని కౌలు రైతులు, పేద రైతుల కష్టాలకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదిస్తున్నందుకు ఆయన ఫోన్ హ్యాకింగ్ చేస్తున్నదనీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాప్ చేయకపోతే ఎవరు చేస్తున్నారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలొ బిఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి జున్ను రవి బిఎస్.పి పార్టీకార్యదర్శి కాశిని.వెంకటేశ్వర్లు,క్రమశిక్షణ కమిటీ నాయకులు గొల్లమందల పెంటయ్య ఫిట్ ఇండియా అధ్యక్షులు తగరం.రాంనివాస్ మండల నాయకులు జక్కుల చిన్ని,ఉపాధ్యక్షులు పొదిలి వెంకటేష్ ప్రధాన కార్యదర్శి రాయల పోలయ్య బత్తిని.వినోద్ కుమార్ కొప్పుల శ్రీను కోశాధికారి షేక్ జిలానీ,పృథ్వీరాజ్,జక్కుల సుదీర్ పేరాయిగూడెం గ్రామ అధ్యక్షులు నార్లపాటి నరేష్ సంగం దుర్గారావు,మండల మహిళా నాయకురాలు రాయల సుహాసిని,మద్దాల రాణి తదితరులు పాల్గొన్నారు.