Saturday, 7 November 2026

మండల కేంద్రంలో ని “పడా ల ముత్యాలు మెమోరియల్ హై స్కూల్. ” పాఠశాల విద్యార్థులు ఆలేరు

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనం సాక్షి) న్యూస్ డిసెంబర్20/.
మండల కేంద్రంలో ని “పడా ల ముత్యాలు మెమోరియల్ హై స్కూల్. ” పాఠశాల విద్యార్థులు ఆలేరు నియోజకవర్గం స్థాయిలో క్రి.శే.శ్రీ ఆరుట్ల రామచంద్రా రెడ్డి, కమలా దేవి గారి స్వచ్ఛంద సంస్థ నిర్వహించినటు వంటి క్రీడాల లో పాలుపంచు కొని “వాలీ బాల్” ఆట లో నియోజకవర్గంలోని అన్ని ఫాఠశాలల విద్యార్థుల పై పై చెయ్యి సాధిస్తూ మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉదేశించి పాఠశాల చైర్మన్ శ్రీ పడాల శ్రీనివాస్ మాట్లాడారు అనంతరం పిల్లల కు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. దాని తో పాటు గా పిల్లల ప్రతిభను గుర్తిస్తూ వారికి మంచి భవిష్యత్తు ఉంది అని మరింత ముందుకు తీసుకువెళ్లే బాద్యత తీసుకుంటామని చెప్పారు తల్లిదండ్రులు కూడా పిల్లల ను చదువుతో పాటుగా ఆట,పాటలను ప్రోత్సహించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ , మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం , పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.