Thursday, 5 November 2026

బీఆర్ఎస్ మొదటి సమావేశం ఖమ్మంలో జరుగడం ఉమ్మడి జిల్లాల ప్రజల అదృష్టం

బీఆర్ఎస్ మొదటి సమావేశం ఖమ్మంలో జరుగడం ఉమ్మడి జిల్లాల ప్రజల అదృష్టం
* ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు
* ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ

టేకులపల్లి, జనవరి 11( జనం సాక్షి ): టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీగా అవతరించి మొదటి సమావేశం ఖమ్మంలో నిర్వహించడం ఖమ్మం ఉమ్మడి జిల్లాల ప్రజల అదృష్టమని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని ప్రగల్లపాడు రైతు వేదిక భవనంలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం అన్నారు. నియోజకవర్గంలో ఆడపడుచుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, అదేవిధంగా అభివృద్ధి గురించి ప్రత్యేక దృష్టి సారించి అహర్నిశలు కృషి చేస్తున్నఏకైక ఎమ్మెల్యే బానోత్ హరి ప్రియ హరి సింగ్ నాయక్ అని కొనియాడారు . నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే వరకు కార్యకర్తలు , నాయకులు విశ్రమించేది లేదన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు, యువతకు గ్రూప్ 2, గ్రూప్ 3, ప్రిలిమినరీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తూ, స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం గర్వించదగిన విషయం అన్నారు . అదేవిధంగా జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులు అయిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సఫలీకృతులవుతున్నారన్నారు. ఇల్లందు ప్రభుత్వాసుపత్రిని వైద్య విధాన పరిషత్ లోకి తీసుకువచ్చి నిరుపేద రోగులకు వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. నేడు ఇల్లందులో గర్భిణీల