రేషన్ దుకాణాలు ఆదరైజేషన్ లేకుండా నిర్వహిస్తే తగిన చర్యలు
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్
కొండమల్లేపల్లి జనవరి 11 జనం సాక్షి న్యూస్ :
రేషన్ దుకాణాలను తగిన అనుమతి లేకుండా నిర్వహిస్తే , రద్దు ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. బుధవారం నాడు ఆయన కొండమల్లేపల్లి లో చౌక దుకాణాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్బంగా రఘునందన్ మాట్లాడుతూ.. జనవరి నెల కు గాను రేషన్ బుధవారం ప్రారంభం అయ్యిందని చెప్పారు.కొన్ని రేషన్ దుకాణాలను తగిన అనుమతి ఆధారైజేషన్ లేకుండా నిర్వహిస్తే రద్దు ఖాయం అని స్పష్టం చేశారు.దేవర కొండ డివిజన్ లో కొన్ని చౌక దుకాణాల ను ఆధరైజేషన్ లేకుండా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ను ప్రహాసహం చేసే వారి పై క్రిమినల్ చర్యల కు సైతం వెనకాడబోననీ హెచ్చరించారు.
రేషన్ దుకాణాలు ఆదరైజేషన్ లేకుండా నిర్వహిస్తే తగిన చర్యలు




