జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలము పన్నూర్ గ్రామపంచాయితికి సంబందించిన 2023 – 2024 సంవత్సరమునకు వారసంత వేలము గ్రామపంచాయతి పన్నూర్ కార్యాలయము ఆవరణలో ఈనెల 11 వ తేదీ సోమవారం ఉ:10-30 గంటలకు బహిరంగముగా వేలము జరుపబడును అని గ్రామ సర్పంచ్ అల్లం పద్మ , పంచాయతీ కార్యదర్శి ఆకాష్ లు ఒక ప్రకటనలో తెలిపారు. వేలములో పాల్గొనువారు ఈ క్రింది షరతులు, నిబంధనలకు లోబడి వేలములో పాల్గొనవచ్చు అని తెలిపారు. కాంట్రాక్ట్ గడువు 12 నెలలు అనగా 01-04-2023 నుండి 31-03-2024 వరకు అమలులో ఉంటుందని, వేలమునకు డిపాజిట్ వారసంత రూపాయలు (15000 ) సర్పంచ్ / గ్రామ కార్యదర్శి గ్రామపంచాయితీ పన్నూర్ పేరున డి.డి ని /నగదు వేలమునకు గంట ముందు అందజేసిన వారు మాత్రమే వేలము పాటలో పాల్గొనుటకు, పాట పాడుటకు హక్కు ఉంటుందని తెలిపారు. సేబార అయిన కాంట్రాక్ట్ దారునిడిపాజిట్లు గ్రామ పంచాయతి నిధికి జమ చేయబడును అని, సేబార కాని పాట దారుల డిపాజిట్లు తిరిగి ఇవ్వబడును అని తెలిపారు.




