బీజేపీని అప్రతిష్టపాలు చేస్తున్నారు


` సీఎం మండిపడ్డ బండి సంజయ్‌
` డిసెంబర్‌ 17నుంచిమళ్లీ పాదయాత్ర చేస్తానని వెల్లడి
హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీ అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హావిూ ఇచ్చారు. అన్ని వ్యవస్థలను టీఆర్‌ఎస్‌ నాశనం చేసిందని విమర్శించారు. డిసెంబర్‌ 17 నుంచి మళ్లీ పాదయాత్ర మెదలు పెట్టనున్నట్లు తెలిపారు. బీజేపీ పాదయాత్రతో టీఆర్‌ఎస్‌ పతనం మెదలైందని సంజయ్‌ పేర్కొన్నారు. రెండోరోజు తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ బీజేపీని బద్నాం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు మంచిరోజులు రాబోతున్నాయని ఓ జ్యోతిష్యుడు తనకు చెప్పారన్నారు. సీఎం సీటు కోసం ప్రగతిభవన్‌లో కుటుంబ సభ్యుల మధ్య కొట్లాట జరుగుతుందన్నారు. తమను సీఎం ఎప్పుడు చేస్తావని కొడుకు, బిడ్డ, అల్లుడు కేసీఆర్‌ ను అడుగుతున్నారన్నారు. అందుకే ఉన్నన్ని రోజులు తానే సీఎంగా ఉండాలని కేసీఆర్‌ కోరుకుంటున్నాడన్నారు. సీఎం సీటు కోసం కొడుకు, బిడ్డ, అల్లుడిని రెచ్చగొడుతూ కేసీఆర్‌ పబ్బం గడుపుకుంటున్నాడన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతును గెంటేస్తున్నారన్నారు. దీనికి ఉదాహరణ ఈటల రాజేందర్‌ అని అన్నారు. ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌లో స్థానం లేదనే… రాజేందర్‌ లాంటి వాళ్లను బయటకు పంపుతున్నారన్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని.. నియంత, కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. ప్రజల ద్రుష్టి మళ్లించడానికి కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ ఢల్లీికి ఎందుకు పోయిండో అర్ధం కాలేదన్నారు. అపాయిట్‌ మెంట్‌ ఇవ్వలేదనే సాకుతో ఆత్మగౌరవం సెంటిమెంట్‌ ను రాజేద్దామనుకున్నాడన్నారు. అపాయిట్‌ మెంట్‌ అడగనేలేదని పీఎంవో చెప్పడంతో కేసీఆర్‌ కుట్ర ప్రజలకు అర్ధమైందన్నారు. సొంత పనుల కోసం ఢల్లీికి పోయిన కేసీఆర్‌.. అపాయిట్‌ మెంట్‌ పేరుతో బీజేపీని అప్రతిష్టపాల్జేయాలని కుట్ర చేశాడన్నారు. కేసీఆర్‌ కు రాజకీయ పతనం మొదలైనట్లు చెప్పారు. ప్రజలు చీదరించినా, చీత్కరించినా..బీజేపీని నవ్వులపాలు చేయాలనే నీచమైన కుట్రకు కేసీఆర్‌ పాల్పడ్డారన్నారు. త్వరలోనే తెలంగాణ తల్లికి విముక్తి కాబోతుందని.. బీజేపీతోనే అది సాధ్యం కాబోతుందన్నారు. అందుకోసం రక్తాన్ని ధారపోయాల్సి ఉంటుందన్నారు. త్యాగాలకు విూరు సిద్ధమా? రక్తాన్ని ధారపోసేందుకు ప్రజలంతా సిద్ధమైతే.. గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే బాధ్యత తనదన్నారు.