Tuesday, 3 November 2026

బీజేపీ ధర్నా….పంట రుణాలు మాఫీ చేస్తామని

బీజేపీ ధర్నా….పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం – బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి….

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మరియు ధరణి పోర్టల్ రద్దు చేయాలని, లక్ష రూపాయల పంట రుణాలు మాఫీ చేయాలని మరియు కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు లేకుండా వడ్లను కొనుగోలు చేసి రసీదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల పటణంలోని ఐబీ చౌరస్తాలో బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు రైతు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కష్టపడి పండించుకున్న పంటను తరుగు పేరుతో జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల సహకారంతో ప్రతి బస్తాకు 3-4 కేజీల వడ్లను రైతు వద్ద నుండి తరుగు పేరుతో దోచుకుంటున్నారని మరియు ధాన్యం కొనుగోలు అనంతరం రైతుకు ఇవ్వాలసిన రసీదు ఇవ్వడం లేదు అని అన్నార. రైతులు పండించిన పంటను తరుగు పేరుతో జిల్లా లోని ముగ్గురు ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని అన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నికల సమయంలో లక్ష రూపాయల పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి తీర రెండో సారి అధికారంలోకి వచ్చి 4ఎండ్లు గడిచిన ఇప్పటి వరకు పంట రుణాలను మాఫీ చేయకుండా రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది అని అన్నారు. కేసిఆర్ కుటుంబం ఈ రాష్ట్రంలో ఉన్న విలువైన భూములను దోచుకోడానికి ధరణీ పోర్టల్ తీసుకువచ్చి అక్రమంగా కేసిఆర్ కుటుంబ సభ్యుల మీద భూములను పట్టాలు చేయించుకుంటున్నారని అన్నారు. ధరణి పోర్టల్ లో ఉన్న లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ధరణి పోర్టల్ వల్ల కేవలం కేసిఆర్ కుటుంబానికి లాభం చేకూర్చుతుంది తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా లాభం లేదు అని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల లక్షల మంది పేద రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఒక్క వైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతులకు లాభం చేకూర్చే విధంగా కిసాన్ సమ్మన్ నిధి, యూరియా పై సబ్సిడీ, పంట నష్టం జరిగితే ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన, పంట మద్దతు ధర పెంపు వంటి పథకాలు ప్రవేశ పెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల పంట రుణాలు మాఫీ చేయాలని మరియు ధరణీ పోర్టల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి వెంటనే రైతుకు రసీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రజీనిష్ జైన్, అందుగుల శ్రీనివాస్, మినిమంద రమేష్, పోనుగోటి రంగ రావు, పెద్దపెల్లి పురుషోత్తం, మున్నరాజా సిసోడియా, పానుగంటి మధు, ఆనంద్ కృష్ణ, కోయ్యల ఎమాజి, రేకందర్ వాణీ, మధవరపు వెంకట రమణ రావు, జోగుల శ్రీదేవి, పత్తి శ్రీనివాస్, పట్టి వెంకట కృష్ణ, బియ్యల సతీష్ రావు, కృష్ణ దేవరాయల, వివిధ మండల అధ్యక్షులు, జిల్లా, మండల నాయకులు మరియు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు