Tuesday, 3 November 2026

మృతుడు వెంకటరెడ్డి కుటుంబానికి పరామర్శ  ఒంటెద్దు నరసింహారెడ్డి

మృతుడు వెంకటరెడ్డి కుటుంబానికి పరామర్శ
ఒంటెద్దు నరసింహారెడ్డి
ఫోటో రైట్ :అప్ కుటుంబాన్ని నరసింహారెడ్డి
పెన్ పహాడ్ . డిసెంబర్ 29 (జనం సాక్షి)  :మండల పరిధిలోని అనంతారం గ్రామ బిఆర్ఎస్ యువజన నాయకులు గార్లపాటి సైదిరెడ్డి తండ్రిగారైన గార్లపాటి వెంకటరెడ్డి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మండలి సభ్యులు ఒంటెద్దు నరసింహారెరెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ , ప్రగాఢ సంతాపం తెలియజేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారన్నారు . పరామర్శించిన వారిలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మామిడి అంజయ్య,రైతు సమన్వయ మండల అధ్యక్షుడు పి. నాగార్జున, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కట్ల నాగార్జున, బి ఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు దంతాల వెంకటేశ్వర్లు, బి ఆర్ఎస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్, లిఫ్ట్ చైర్మన్ మలిగిరెడ్డి జనార్దన్ రెడ్డి, విద్యార్థి సంఘ నాయకులు లింగయ్య. రమేష్ తదితరులు పాల్గొన్నారు