జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బీజేపీ పార్టీ ఆఫీస్ లో బొడ్డు శివకుమార్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లో కాటారం, గారెపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మంది గ్రామస్తులు చేరారు. వీరికి సునీల్ రెడ్డి కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి, సంక్షేమ పథకలకు ఆకర్షితులై, మంథని ప్రాంతంలో మార్పు తీసుకురావాలని లక్ష్యంతో సునీల్ రెడ్డి నాయకత్వం లో పని చేయాలనే ఆకాంక్షతో పార్టీ లో చేరుతున్నట్టు వారు వెల్లడించారు. అనంతరం సునిల్ రెడ్డి ప్రసంగిస్తూ… మంథని ప్రాంతంలో బిజెపి పార్టీ రోజురోజుకి బలపడుతున్నదని అన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని, మంథని ప్రాంత కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు అభివృద్ధిలో పోటీ పడడం చేతకాక ప్రెస్ మీట్ లు పెట్టుకొని వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం తిట్టుకోవడం ఎజెండాగా మలుచుకున్నారని విమర్శించారు. అకాల వర్షంతో ప్రజలు తీవ్ర నష్టపోయారు..వారిని పట్టించుకోవాల్సింది పోయి ఒకరినొకరు దూషించుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీకో కన్వినర్ నాంపల్లి రమేష్, కాటారం మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, కాటారం మండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేంద్ర ప్రసాద్,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బోయిని నారాయణ, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లికార్జున్, బూడిద తిరుపతి, చీదురాల మధుకర్ రెడ్డి, టి రాజు,బొల్లం పల్లి లక్ష్మణ్ , ఎస్ స్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కాసర్ల సూర్య,పట్టణ ఉప అధ్యక్షులు దాసరి శ్రవణ్,యువ నాయకులు ఉప్పు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.




