మహబూబాబుద్ బ్యూరో-మే31(జనంసాక్షి)భారతీయ జనతా పార్టీ యువమోర్చా గార్ల మండల అధ్యక్షునిగా ఎడ్ల రాజశేఖర్ ను నియమించినట్లు బీజేపీ పార్టీ గార్ల మండల అధ్యక్షులు ఠాకూర్ జశ్వంత్ ప్రసాద్ తెలిపారు. పార్టీలో చురుకుగా ఉంటూ పార్టీ అభివృద్ధికై చురుకుగా పనిచేస్తున్న విధానాన్ని గుర్తించి యువమోర్చా అధ్యక్షునిగా ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో పదవిని అప్పగించిన పార్టీ అధ్యక్షులు జశ్వంత్ ప్రసాద్ కు అందుకు సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రావు, యువమోర్చా అధ్యక్షులు సిరికొండ సంపత్, రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యదర్శి రావుక విమాల్ కుమార్ జైన్ కు ఎడ్ల రాజశేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని పార్టీ అందించే ప్రాధకాలని ప్రజలలోకి తీసుకెళ్తూ పార్టీ అభివృద్ధికి శ్రమిస్తానని శేఖర్ తెలిపారు.
బీజేవైఎం మండల అధ్యక్షునిగా ఎడ్ల రాజశేఖర్




