Wednesday, 4 November 2026

బీడీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.

 

 

 

 

 

 

 

బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మోర అజయ్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి.08. (జనంసాక్షి). రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో బీడీ కార్మికులకు సరైన కేటాయింపులు జరగలేదని తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మోర అజయ్ అన్నారు. బుధవారం సిఐటియు కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్ బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని విస్మరించారని అన్నారు. జీవన భృతి పెన్షన్ల విషయంలో కటాఫ్ డేట్ ఎత్తివేస్తామన చెప్పిన ప్రభుత్వం ఆచరణలో అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పి.ఎఫ్ ఉన్న బీడీ కార్మికులు 12 లక్షల మంది ఉన్నారని వీళ్ళందరికీ పెన్షన్లు అందించేలా ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం వల్లే అందరికీ పెన్షన్లు అందే అవకాశం ఉందని తక్షణం స్పందించిని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు. సమావేశంలో సిఐటియు గౌరవ అధ్యక్షులు ముసం రమేష్, సూరం పద్మ, సామల కవిత తదితరులు పాల్గొన్నారు.