Thursday, 5 November 2026

బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

 

 

 

 

 

జనంసాక్షి , కమాన్ పూర్ : ఈ నెల 16న మంథని నియోజకవర్గం కేంద్రంలో బిందెశ్వర ప్రసాద్ మండల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని బీసి సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివఛ్చి విజయవంతం చేయాలని బీ. ఆర్. ఎస్. బీసి మండల శాఖ అధ్యక్షులు నడిగొట్టు సంపత్ కోరారు. కమాన్ పూర్ మండల కేంద్రంలో శుక్రవారం బీపి మండల్ విగ్రహ ఆవిష్కరణకు సంబందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఓ. బీ. సీ రిజర్వేషన్ ల కోసం పోరాడిన మహనీయుడు బీ. పీ మండల్ అన్నారు. బీసిల కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. బీసి వర్గాల కు చేసిన కృషికి కృతజ్ఞత పూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తొలిసారిగా మంథని లి మొట్టమొదటి సారిగా పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధు నెత్రుత్వంలో బిపి మండల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయట్టడం చారిత్రత్మాక నిర్ణయమన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి బీసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీ. ఏ. సీ ఎస్ చైర్మన్ ఇనంగంటి భాస్కర్ రావు, బీ. ఆర్. ఎస్ మండల శాఖ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి , ఆదివరహా దేవస్థానం చైర్మన్ ఇనగంటి ప్రేమలత, వైస్ ఎంపిపి ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, మహిళ మండల అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి,
ప్రజాప్రతినిధులు బొల్లపెల్లి శంకర్ గౌడ్, కొండ వెంకటేష్, కోలేటి శేఖర్, ఏ. ఎం. సీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, కో ఆఫ్సన్ సభ్యులు ఎం. డీ ఇంతియాజ్, నాయకులు ఇనంగంటి రామారావు, మేకల సంపత్, గడప కృష్ణమూర్తి, శేఖర్, నీలం శ్రీనివాస్, రాచకొండ రవి, నీలా రాజయ్య, ఇటవేన కొమురయ్య, గోడిసేల సంపత్, పెండ్లి నారాయణ, బొజ్జ రాజసాగర్, జాబు సతీష్, కొయ్యడ రవి, దీకొండ కొమురయ్య, దండే కిషన్, బొల్లపెల్లి శంకర్ గౌడ్, ఆకుల గట్టయ్య, పంతకాని రవి, పొట్ల శంకర్, అగ్గిమల్ల నర్సయ్య, మేడగొని విజయ్, బోగే తిరుపతి, జంగపెల్లి చిన్న శ్రీనివాస్, కుమార్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.