Wednesday, 4 November 2026

బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా గణతంత దినోత్సవ వేడుకలు.

 

 

 

 

 

రఘునాథ పాలెం జనవరి 26 జనం సాక్షి
పూలే ప్రాంగణం దగ్గర 74వ గణతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక కన్వీనర్ గుంతేటి వీరభద్రం జాతీయ జెండాని ఎగరవేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తు, తూట్లు పొడిచే పనులు చేస్తున్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. రాజ్యాంగాన్ని రక్షించుకునే దుస్థితి లోకి నెట్టివేయబడ్డాం. స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం తో కూడిన సమసమాజాన్ని సాధించాలంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నూటికి నూరు శాతం అమలు అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడిని తీసుకురావాలి.ప్రస్తుతానికి రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టిన తమ స్వంత రాజ్యాంగాలని అమలు చేస్తున్నాయి. కాబట్టి 93% ఉన్న BC, SC, ST, మైనారిటీ ప్రజలు కలిసి పోరాటం చేస్తే తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసేలా ఇప్పటి ప్రభుత్వాలు కనిపించటం లేదు.
ఈ కార్యక్రమంలో BC, SC, ST, మైనారిటీ ఐక్యవేదిక చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు, ఐక్యవేదిక , బహుజన నాయకులు,పెరుగు వెంకటరమణ యాదవ్, బానోత్ బద్రూ నాయక్, నజీమ, బచ్చల పద్మాచారి, , అబ్దుల్ రెహమాన్, లిక్కీ క్రృష్ణారావు, సోమరాజు, నకిరికంటి సురేష్, రావుల వెంకటేశ్వర్లూ, దాసరి శ్రీను, రామారావు, జంగిపల్లి రవి, ఉపేంద్ర నాయక్, రమ్యా, సతీష్ నాయక్, అఖిల్ , గాదరి బాబు, నామ ఏసురత్నం, సునీల్, ప్రణయ్, కే.వీరబాబు, తీగల రామూ, సంపత్ , వీరబాబు, నాగేంద్ర నాయక్ , పీ. నాగేశ్వరరావు , వీరన్న, మెట్టు మధూ, తదితరులు పాల్గొన్నారు