బీసీ కుల వృత్తులకు ప్రభుత్వం ఒకే దాపా లో ఇవ్వాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ….
భువననగిరి టౌన్ జనం సాక్షి ,:– బిసి కులవృత్తిదారులకు ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల రుణ సదుపాయం ఒకే దఫాలో అర్హులందరికీ ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు మాట్లాడుతూ బీసీలకు ఇచ్చే లక్ష రూపాయలు సదుపాయం మాత్రమే కాబట్టి కాలయాపన లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణ సదుపాయం కల్పించాలని అతి తక్కువ సమయం ఇవ్వడం కులంఆదాయం పత్రాలు వంటి షరతులు చాలా మంది బీసీ దరఖాస్తు చేసుకోలేకపోయారు వృత్తి నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన బీసీ కులాలు వృత్తికి సంబంధించిన పరికరాలు సమకూర్చుకుంటారని, చిత్తశుద్ధి ఉంటే బీసీ రుణ సదుపాయాలను నెలనెలా కాకుండా ఒకేసారి ఇవ్వాలని, భువనగిరి పట్టణంలోని దాదాపు 850 మంది వారందరికీ ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా రుణాలను నెల రోజుల్లో అందించాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని బీసీ సంఘాలతో కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ గారు,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుక్కదువు సోమయ్య,నక్కల ఆదినారాయణ, పచ్చల జగన్మోహన్,పిట్టల బాలరాజు తాడూరి నరసింహ, సయ్యద్ ముల్తానిషా, పార్వతి మల్లేష్ సాదు విజయ్ ఎండి యాకూబ్, మొదలగు వారు పాల్గొన్నారు.