బీసీ బాలుర హాస్టల్లో వైద్య శిబిరం
టేకులపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి ): మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర బీసీ హాస్టల్ లో సులానగర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మెంతెన విద్యాసాగర్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 36 మంది పిల్లలకు చికిత్సను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ విద్యాసాగర్ విద్యార్థులతో మాట్లాడుతూ ముఖ్యంగా ఈ చలికాలంలో వచ్చే చర్మవ్యాధులు, శ్వాస కోశ వ్యాధులపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల అనేక వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చని, ప్రతిరోజు వ్యాయాయం, ఆటలు ఆడటం ద్వారా చక్కటి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పిల్లలకు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చైతన్య, ఏఎన్ఎం పరంగిని, స్టాఫ్ నర్స్ ప్రసన్న, ఆశా కార్యకర్త మజహరి పాల్గొన్నారు.




