బుడిదగట్టు తండాలోజిల్లా స్థాయి క్రీకెట్ టొర్నమెంట్ ను ప్రారంభించిన టీపీసీసీ నాయకులు కేతావత్ భీల్యా నాయక్
కొండమల్లేపల్లి జనవరి 12 జనం సాక్షి న్యూస్
పీ ఎ పల్లి మండల పరిదిలొగల బూడిదగట్టు తండాలొ నిర్వహిస్తున్నా జిల్లా స్థాయి క్రీకెట్ టొర్నమెంట్ ను ప్రారంభించిన టీపిసిసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్.. బీల్యా నాయక్ వస్థున్నారని తెలుసుకున్నా ఆ ప్రాంత నాయకులు బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు.గతంలొ ఈ ప్రాంతంలో బీల్యా నాయక్ అందించిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా బీల్యా నాయక్ మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడా రంగంలో మంచి నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలి. గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీ ప్రదర్శనలు తీయాలని , భవిష్యత్తులో ఇలా అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదిగి మన ప్రాంతానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే , ఓడిపోయినా నిరుత్సాహం పడకూడదు. గెలిచాము అని గర్వపడవద్దు. స్నేహపూర్వకంగా క్రీడలను ఆడాలి. ఓడిపోయినా ఓటమి విజయానికి నాందిగా భావించాలి అని పేర్కొన్నారు క్రీడలు మానసీక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్థాయని ఇందులొ భాగంగా మెదటి బహుమతిగా 25000/రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరేందర్, ఎంపీటీసీ నారాయణ, పీఎ పల్లి కాంగ్రెస్ మండల్ అద్యక్షులు ఎల్లయ్య,మాజి సర్పంచ్ నాగయ్య, ద్వితీయ బహుమతి దాత హనుమంతు, రఘు నాయక్, అమర్నాథ్ గౌడ్, మోతిలాల్,హరి నాయక్,శుభాష్ నాయక్,రవి, జనార్దన్, హన్ము,ఆంజనేయులు,సీరి,రాజు, మహేష్,శ్రీను,సాయి,జీవన్, నాగార్జున, జైపాల్ నాయక్,బీల్యా నాయక్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు




