Thursday, 5 November 2026

సమస్యలే మనకు పరిష్కారం చూపెడతాయి

సమస్యలే మనకు పరిష్కారం చూపెడతాయి

కలెక్టర్ అనురాగ్ జయంతి

జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు,టీచర్లకు కలెక్టర్ అభినందన

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 12. (జనం సాక్షి).నిర్మల్ లో జనవరి తొమ్మిది నుండి గత మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మానక్-జవాహర్ లాల్ నెహ్రు సైన్స్ ఎగ్సిబిషన్ లో రాజన్న సిరిసిల్ల విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్ లో అధికారులను అభినందించారు.ఈ సందర్భముగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారు తయారు చేసిన ప్రాజెక్ట్ ల గురించి అడిగి తెలుసుకున్నారు.వారు ఎంచుకున్న అంశములు దైనందిన జీవితం లో ఎంతో ఉపయోగకరమైనవని అన్నారు.నిజ జీవితం లో ఎదురయ్యే సమస్యలే వారికి పరిష్కారం చూపెడతాయని అన్నారు. డి ఈ ఓ ధనాలకోట రాధా కిషన్ మాట్లాడుతూ జిల్లా నుండి 3ఎగ్జిబిట్స్ నేషనల్ కి,2 సౌత్ ఇండియా లెవెల్ కి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు ఎగ్జిబిట్స్ లో మార్పులు చేయుటకు నిపుణుల సలహాలు తీసుకొని జాతీయ స్థాయిలో ఎంపిక అయ్యేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమం లో, సైన్స్ అధికారి పాముల దేవయ్య , ప్రధానోపాధ్యాయులు నాగుల భాగ్యరేఖ,నారాయణ గైడ్ టీచర్లు మహేష్ చంద్ర,దోర్నాల భూపాల్ రెడ్డి,కిషన్, నవీన్,విద్యార్థులు శ్రీ సమర్థ,వినీల,జంకే శ్రీనిధి,పండుగ సహస్ర లు పాల్గొన్నారు.