బురదమయంగా మారిన ధన్నూర్ రోడ్డు

   బోథ్ జూన్ 17(జనంసాక్షి) చినుకు పడిందంటే ధన్నూర్ వైపు ఉన్న గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బోథ్ మండలం కుచులాపూర్ ఆలయం వద్ద నుండి ధన్నూర్, కుచులాపూర్, చిన్న ధన్నూర్, ఖండిపల్లి లతో పాటు మరో పది గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. అసలే గుంతల మయమైన రోడ్డు తో నిత్యం భయం భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుంతల్లో నీరు నిలిచి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంలో పట్టించుకోవాలని కోరుతున్నారు.