విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు.
అదిలాబాద్ బ్యూరో జనం సాక్షి : తాంసీ మండలంలోని పొన్నారి గ్రామం లో ని ప్రైమరీ పాఠశాల లో విద్యార్థుల సౌకర్యార్థం 130 మంది విద్యార్థులకు ముచ్చ స్వామి పది వేల రూపాయల విలువ చేసే నోటుబుక్కులను స్థానిక వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు ల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఇదే పాఠశాలలో చదువుకుని ఉన్నత ఉద్యోగం సంపాదించిన ముచ్చ స్వామి ప్రస్తుతం ఉట్నూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన మిత్రుల సహాయంతో విద్యార్థులకు నోటు బుక్కు లు లేవని తెలుసుకొని విద్యార్థులకు బుక్కులను అందజేయడం పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.