బూత్ స్థాయిలో బిజెపి పార్టీ బలోపేతం చేయడం గురించి దిశ నిర్దేశం
హుజూర్ నగర్ డిసెంబర్ 9 (జనంసాక్షి): శక్తి కేంద్ర ఇన్చార్జులను నియమించి బూత్ కమిటిలను పూర్తిచేసి బూత్ స్థాయిలో బిజెపి పార్టీ బలోపేతం చేయడం గురించి శుక్రవారం హుజూర్ నగర్ పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దిశ నిర్దేశం చేశారన్నారు. హుజూర్ నగర్ బిజెపి పట్టణ ఇంచార్జ్ గజ్జెల వెంకటరెడ్డి సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ఆయనను బిజెపి నాయకులు శాలువాతో సత్కరించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దేనుమకోండ రామరాజు, పట్టణ అధ్యక్షులు ముసుకుల చంద్రారెడ్డి, ఇంటి రవి, ఉపాధ్యక్షులు గుండా గోపి, వల్లపుదాస్ గోపీనాథ్, యల్లావుల సోమరాజు, మంద వెంకటేశ్వర్లు, బత్తుల ఉపేందర్, బండారు శివ, రామిశేట్టి వేణు, ఈర్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.
బూత్ స్థాయిలో బిజెపి పార్టీ బలోపేతం చేయడం గురించి దిశ నిర్దేశం




