Tuesday, 3 November 2026

బెడ్రూములు పింషన్లు దళితబంధు రేశంకార్డులు వెంటనే ఇవ్వాలి.

డోర్నకల్ జులై 2 జనంసాక్షి న్యూస్ :రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అర్హులందరికీ ఇంటికి 5.లక్షలు అసర పింషన్లు దళితబంధు రేశంకార్డులు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ తక్షణమే ఇవ్వాలని వ్య.కా. సంఘం మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పనపెళ్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.అదివారం డోర్నకల్ మండలంలోని అమ్మపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రజల సమక్షంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహిస్తుంన్నమని అన్నారూ.ధరణిలో ఉన్న లోపాలను సరి చెయ్యాలి. రైతులకు లక్ష రూపాయలు వెంటనె మాఫి చెయ్యాలని డిమాండ్ చేశారు.జూలై 3న మహబూబాద్ కలక్టరేట్ వద్ద జరుగు మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ఈ సర్వే కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ కార్యదర్శి కస్తూరి రాజా ఐద్వా నాయకురాలు షేక్ మున్నీర్ గ్రామ వివిద ప్రజాసంఘాల నాయకులు కిత సీతారాములు వేములకొండ సత్యనారాయణ యు.వేణు మద్దెల బిక్షం దెంకిన చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.