Friday, 6 November 2026

బైకును ఢీకొన్న ఇసుక లారీ: ముగ్గురు మృతి

గుంటూరు,మే21(జ‌నం సాక్షి):  గుంటూరు జిల్లాలో ఇసుకలారీ ఓ కుటుంబాన్ని బలిగొన్నది. వేగంగా వచ్చి ముందు వెళుతున్న బైకును బలంగా డీకొనడంతో భార్యాభర్తలతో పాటు ఓ పాప అక్కడిక్కడే మృతి చెందారు.  తాడేపల్లిగూడెం మండలం నులకపేట వద్ద మంగళగిరి వైపు వెళుతున్న బైక్‌ను వెనుకనుంచి వచ్చిన ఇసుకలారీ ఢీ కొట్టింది. బైక్‌పై ఉన్న భార్యాభర్తలు కమ్మతోట శ్రీకాంత్‌, సరిత, వారి ఏడాది కుమార్తె అక్షర అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఇసుక లారీలు మితివిూరిన వేగంతో వెళుతున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు.
———–