Monday, 2 November 2026

బైరినరేష్ పై చర్యలు తీసుకోండి

బైరినరేష్ పై చర్యలు తీసుకోండి…

– మాహగంలో నిరసనలు చేపట్టిన అయ్యప్పస్వాములు, బిజెపి నాయకులు…

రోడ్డుపై రాస్తారోకో చేస్తూ బైఠాయించిన వైనం….

 

భైంసా రూరల్ డిసెంబర్ 31 జనం సాక్షి

బైరినరేష్ ఇటీవల ఓ సభలో చేసిన అనుచిత వాక్యాలపై వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటూ శనివారం బైంసా మండలం మహాగం గ్రామంలో అయ్యప్ప స్వాములు,బీజేపీనాయకులు కలిసి రాస్తారోకో నిర్వహించారు.ఇలాంటి వారిపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. గ్రామ సర్పంచ్ అప్పల రాకేష్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఏకపక్ష వైఖరినిమాని ప్రవర్తించాలని అన్నారు. హిందూ దేవతలపై అనుచిత వాక్యాలు చేయడం సబబు కాదని, ఇటీవల రాజాసింగ్ పై అనుచిత వాక్యాల విషయమై ప్రభుత్వం పీడి యాక్ట్ నమోదు చేసింది. బైరి నరేష్ పై కూడా పిడి యాక్ట్ నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాస్తారోకోతో కొధ్దిమేర వాహన రాకపోకలు నిలిచాయి.