హైదరాబాద్,(జనంసాక్షి): రాయల తెలంగాణ పేరిట సీమను విచిన్నం చేసే కుట్రలకు నిరసనగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన రాయలసీమ ఆత్మగౌరవ 52 గంటల దీక్షకు ఎమ్మార్సీపీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బైరెడ్డిని పరామర్శించిన మందకృష్ణ మాట్లాడుతూ వెయ్యిమంది సోనియాలు, లక్షమంది దిగ్విజయ్‌లు వచ్చిన రాయలసీమ జిల్లాలను విడగొట్టలేరన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ రాయలసీమ జిల్లాలను విభజించాలని చూస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నోరు విప్పడం లేదని మందకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ ప్రదక్షానాలు చేస్తూ నదవిని కాపాడుకోవడానికే సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. రాయలసీమ జిల్లాల విభజనపై రిఫరెండం పెట్టాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. సీమ జిల్లాల విభజనపై నోరు విప్పని 52 మంది ఎమ్మెల్యేలకు రాయలసీమ ప్రజల సమాధి కడతారని ఆయన హెచ్చరించారు.




