Monday, 2 November 2026

సీ.ఎం.ఆర్. ఎఫ్ చెక్కు పంపిణి

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ముల్కలపల్లి గ్రామానికి చెందిన మచ్చ రాజు కు రూ. 60 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయానిది చెక్కును మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు గురువారం బీ.ఆర్.ఎస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ బొల్లపెల్లి శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ పోలుదాసరి సాయికుమార్, నాయకులు రాచకొండ రవి, అబ్బీడి సంతోష్ రెడ్డి, బొమ్మగాని అనిల్ గౌడ్, ముల్కల పల్లి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గాజుల సతీష్, యూత్ అధ్యక్షులు గున్నాల చిరంజీవి, ప్రధాన కార్యదర్శి తాల్లపెల్లి శ్రీనివాస్, వ వార్డ్ మెంబర్ మెట్టు రాములు, బోల్లపెల్లి దశరతం, బొల్లపెల్లి కుమార్ పులి సాయి తదితరులు పాల్గొన్నారు.