Thursday, 5 November 2026

బై0సా దత్తాత్రేయమఠంలో12 వ శతాబ్దంనాటి శిల్ప సంపద

బై0సా దత్తాత్రేయమఠంలో12 వ శతాబ్దంనాటి శిల్ప సంపద…

– గుర్తించిన జిల్లాకళాకారుడు…

, నవంబర్ 16 జనం సాక్షి భైంసా రూరల్

భైంసా పట్టణం లోని బట్టిగల్లి హనుమాన్ విగ్రహమూర్తి సమీపంలో గల దత్తాత్రేయ మఠంలో 12వ శతాబ్దానికి చెదిన,నాటి గొప్ప శిల్పసంపదతో నిర్మించి ఉందని కళాకారుడు పోలీస్ భీమేశ్ పెర్కొన్నారు.ఇక్కడి స్థానికులు దీన్ని దత్తమఠంగా పిలుస్తారు. చిత్రకారుడు కళాకారుడైన పోలీస్ భిమేష్ ఇక్కడి చిత్రాలను గమనించి తెలిపిన విషయాలు…
ఈ మఠంలో సూర్య చంద్రుల సాక్షిగా యుద్దానికి పరుగెడుతున్న గుర్రం పై వీరగల్లు అతని కుడి చేతిలో బెల్లెం,ఎడమ చేతిలో డోలు పట్టుకొని యుద్దానికి బయలుదేరినట్లు,గుర్రానికి అలంకరించిన కుడ్య శిల్పం తెలియజేస్తుందని,శైవ ద్వారపాలకులతో “పరిచారికళతో చాళుక్య శైలి”, రాష్ట్రకూట శైలి ద్వారంతో కూడిన “ఫంసానా పద్దతి” లో గుడి విమానం ఉందని,
సమీపంలో మూడు పెద్ద శివలింగాలు, పడమటి దిక్కులో కిందినుండి భూమికి సమాంతర భాగం వరకు రెండు అంతస్తులతో కాల్చిన ఇటుకలతో నిర్మించిన వంతెన కోనేరు ఇప్పటికీ ఉందని. మఠం దగ్గర చుట్టూ ప్రాంతం సన్యాసుల సమాధుల రాతి నిర్మాణం గమనించవచ్చని తెలిపారు.తవ్వకాలు జరిపితే కూలిన మట్టిగోడలో చరిత్రకు సంబంధించిన అనేక శిల్ప సంపద బయటపడే అవకాశం ఉందని కళాకారుడు భీమేశ్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి శిల్ప చిత్రాలను చరవాలని లో బంధించి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ ప్రొఫెసర్. రామోజి హరగోపాల్ కి చిత్రకారుడు, కళాకారుడైన భీమేష్ పంపాగా ఈ ద్వారపాలకులు, ఫంసానా పద్దతిని బట్టి ఇది “12 వ శతాబ్దానికి చెందిందిగా పెర్కోన్నారని తెలిపారు.ఇక్కడి నాటి శిల్పకలను ప్రజల సంరక్షించాలన్నరు.