Wednesday, 4 November 2026

లేబర్, భవన కార్మికులకు వైద్య శిబిరం

టేకులపల్లి, జూన్ 5( జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలో సి & సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో తెలంగాణ లేబర్ భవన కార్మికులకు సోమవారం వైద్య శిబిరాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సి అండ్ సి జిల్లా కోఆర్డినేటర్ అక్బర్, క్యాంపు కోఆర్డినేటర్ మహేష్,హెల్త్ కేర్ బృందం 52 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంమంగళవారం కూడా నిర్వహించ బడుతుందని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ భూక్య లక్ష్మణ్, మూడు హుస్సేన్, భూక్య లాలు నాయక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోతు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.