Wednesday, 4 November 2026

బొడ్రాయి పున ప్రతిష్ఠాపనికి ముదిరాజు సంఘం విరాళం అందజేత

 

ఆత్మకూర్(ఎం) జనవరి 25 (జనంసాక్షి) ఆత్మకూర్ గ్రామంలో బొడ్రాయి పున ప్రతిష్ఠాపన చేయనున్న బొడ్రాయి ఉత్సవాలకు ఆత్మకూరు గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎద్దు వెంకటేశ్వర్లు ఆసంఘం పెద్దలు చేతుల మీదుగా తమ 75 గడపల నుండి సేకరించిన 75,116 రూపాయలను గ్రామ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ కి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ నగేష్ మాట్లాడుతూ సహకరించిన ముదిరాజ్ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ యాస కవిత ఇంద్రా రెడ్డి మరియు ఉప సర్పంచ్ దొంతరబోయిన నవ్య భాస్కర్ మరియు అఖిల పక్ష నాయకులు యాస లక్ష్మారెడ్డి సుల్తాన్ పురుషోత్తం లోడి వెంకటయ్య పోతగాని మల్లేశం ముదిరాజు సంఘం నాయకులు తవిటి రాములు తవిటి హరినాదం బండారు సత్యనారాయణ బండారు కనకయ్య కల్వల రాములు గూడపురి స్వామి పసుల నర్సింహా తవిటి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు