బూర్గుంపహాడ్ జూన్ 01(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం కేంద్రం లో పి ఎ సి ఎస్ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాస రావు అధ్యక్షతన సొసైటీ కార్యాలయములో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు విజయ వంతం చేయుటకు గాను సంఘ కార్యవర్గ సమావేశము నిర్వహించారు. ఈ సమావేశములో సంఘ మానిటరింగ్ అధికారి టి సుజాత, కార్యవర్గ సభ్యులు, కార్యదర్శి బి వి ప్రసాద్, సిబ్బంది పాల్గోన్నారు.




