Wednesday, 4 November 2026

బ్యాంకులకు వరుస సెలవులు..

రానున్న వారంలో రోజుల్లో బ్యాంకులకు స్వల్ప విరామంతో వరుస సెలవులు వస్తుండడంతో ఆర్థిక లావాదేవీలకు కొంత విఘాతం కలుగనుంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 5వ తేది వరకు ప్రధాన బ్యాంకులకు దాదాపు ఆరు రోజుల వరకు సెలవులు వస్తున్నాయి. దీంతో చిన్న, మధ్య తరగతి వారికి డబ్బులకు ఇబ్బంది తప్పేలా లేదు. ఈ నెల 28న శ్రీరామ నవమి, 29న ఆదివారం, ఆ తరువాత 30, 31వ తేదీలు ఆర్థిక సంవత్సరపు చివరి రోజులు కావడం..ఏప్రిల్-1 ఖాతాల వార్షిక ముగింపు కారణంగా బ్యాంకులలో లావాదేవీలేవి పెద్దగా జరగవు. 2వ తేది మహవీర్ జయంతి, 3న గుడ్ఫ్రైడే, 4న సగం పూట మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. దీనికి తోడు 5న మరో ఆదివారం రావడంతో ఆరోజు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. దీంతో వ్యాపార లావాదేవీలు కొంత స్తంభించే అవకాశం ఉంది. వరుస సెలవుల కారణంగా ఏటీఎం సేవలకు కూడా కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన పడుతున్నాయి. స్వల్ప తేడాతో ఎక్కువ సెలవులు వరుసగా వస్తుండడంతో ఖాతాదారులు తమ ముఖ్యమైన లావాదేవీలను ఈ నెల 27వ తేదీలోపే ముగించుకోవడం ఉత్తమమని.. లేకుంటే ఇబ్బందులు తప్పవని పలు అసోసియేషన్ల వారు సూచిస్తున్నారు. మరోవైపు ఒకటో తేదీన జీతం అందుకోనే వేతన జీవులు కూడా ఈనెల సరైన సమయానికే తనకు జీతం అందుతుందో లేదోనంటూ ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *