చిన్న పిల్లలపై పుస్తకాల మోతతో మెదడుపై ప్రభావం
కేంద్ర మార్గదర్శకాలను పట్టించుకోని పాఠశాలలు
హైదరాబాద్,నవంబర్27 (జనంసాక్షి ) : చిన్నపిల్లల చదువుల విషయంలో మోత తగ్గించాలని చేసిన సూచనలు అమలు కావడంలేదు. ఎల్‌కెజి నుంచే బ్యాగుల బరువు తగ్గించాలన్న మేధావుల సూచనలు పట్టించుకోవడం లేదు. దీనిపై సిరియస్‌గా ఆలోచన చేయాలని విద్ఆయరంగ ప్రముఖులు సూచిస్తున్నారు. పిల్లలపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని చుక్కా రామయ్య లాంటి విద్ఆయవేత్తలు తరచూ ఆవేదన చెందుతున్నారు. వీపులు ఒంగి పోయేలా పుస్తకాల మోత మోగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. చిన్నారులపై పుస్తకాలు, ¬ంవర్క్ ఒత్తడి పెరుగుతున్న చోద్యం చూస్తున్నారు. ఈ దశలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఎలాంటి ¬ంవర్క్ ఇవ్వరాదని కేంద్రమానవ వనరుల శాఖ ఇచ్చిన ఆదేశాలు అమలు కావాల్సి ఉంది. ఈ తరగతులకు చెందిన విద్యార్థుల పాఠశాల బ్యాగు బరువు 1.5 కిలోలకు మించరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠశాల బ్యాగుల బరువు, బోధనాంశాల నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ గతంలోనే ఆదేశాలు జారీచేసింది. ఈ మార్గదర్శకాలు తాము జారీచేసిన సూచనల మేరకు ఉండాలని తెలిపింది. అయితే గతంలో కూడా ఇలాంటి ఆదేశాలు ఉన్నాయి. వాటిని అమలు చేయకపోతే ఏం చేయబోతున్నారో..ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పలేదు. అన్ని పాఠశాలలు ¬ంవర్క్, స్కూల్ బ్యాగుల బరువుకు సంబంధించి తమ సూచనలను వెంటనే అమలు చేయాలని కూడా ఆదేశించింది. బోధనాంశాలకు సంబంధించి.. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు భాషలు, గణితం తప్ప మరే ఇతర సబ్జెక్టులను బోధించరాదని మానవవనురల శాఖ స్పష్టంగా తెలిపింది. 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు భాషలు, గణితం, పర్యావరణ శాస్త్రం తప్ప మరే సబ్జెక్టులను బోధించరాదని స్పష్టంచేసింది. ఈ సబ్జెక్టులు కాకుండా ఇతర అదనపు పుస్తకాలు లేదా అదనపు బోధనా సామగ్రిని విద్యార్థులకు ఇవ్వడానికి పాఠశాలలకు అనుమతి లేదని తెలిపింది. నిజానికి ప్రైవేట్ పాఠశాలల్లోనే ఇలాంటి నిబందనలు ఎక్కువ. లెక్కకు మిక్కిలి వారికి పుస్తకాలను కట్టబెట్టి, మెదడుకు ఎక్కనంతగా పాఠ్యాంశాలను రుద్దుతున్నారు. వారి చిన్నారి మెదడు చిట్లిపోయేలా పాఠ్యాంశాలను రుద్దుతున్నారు. ఇలాంటి పాఠ్యాంశాలపై అజమాయిషీ లేకుండ ఆపోయింది. విద్యార్థుల పాఠశాల బ్యాగు బరువుకు సంబంధించి కూడా ఎంహెచ్ఆర్డీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీనిప్రకారం ఒకటి, రెండు తరగతుల విద్యార్థుల పాఠశాల బ్యాగు బరువు 1.5 కిలోలకు మించరాదు. 3 నుంచి 5 తరగతుల విద్యార్థుల స్కూల్ బ్యాగు బరువు 2 నుంచి 3 కిలోలు మించరాదు. 6 నుంచి 7 తరగతుల విద్యార్థుల పాఠశాల బ్యాగు బరువు 4 కిలోలు, 8 నుంచి 9 తరగతుల విద్యార్థుల బ్యాగు బరువు 4.5 కిలోలు, పదో తరగతి విద్యార్థుల బ్యాగు బరువు 5 కిలోలు మించకూడదు. పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేయాలని గతంలోనే మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతోపాటు ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ¬ంవర్క్ ఇవ్వకుండా ఉండే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. విద్యార్థుల బ్యాగుల బరువు తగ్గించే పలు పద్ధతులను అమలు చేయాలని 2016 ఏప్రిల్‌లో సీబీఎస్ఈ తన అనుబంధ పాఠశాలలకు నోటీసులు జారీచేసింది. పుస్తకాల సంఖ్యను తగ్గించేందుకు 25 కేంద్రీయ విద్యాలయాల్లో 2016లో ఎంహెచ్ఆర్డీ ఓ పైలట్ ప్రాజెక్టును అమలు చేసింది.
ప్రధానంగా సృజనాత్మకత అన్నది ప్రైవేట్ విద్యార్థుల్లో కొరవడింది. సీసీఈ అమలు తీరులో లోపాలు వెలుగులోకి వచ్చాయి. మార్కులు తక్కువ వస్తే పాఠశాల పేరు పడిపోతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను మరో పాఠశాలకు పంపించే అవకాశం ఉంటుందని ప్రైవేట్ పాఠశాలలు మార్కులు వేస్తున్నాయి తప్ప, నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిని అనుసరించడం లేదని తేల్చాయి. ప్రైవేట్ పాఠశాలల్లో సీసీఈపై అవగాహన లేకపోవడం.. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్దేశం పక్కదారి పడుతోందని గుర్తించారు. వీటిని కప్పిపుచ్చుకోవడానికి అన్నట్లు పుస్తకాలు, బ్యాగుల మోతతో పిల్లపై భారం మోపుతున్నారు. ఇలాంటి పటాటోపం తగ్గించేందుకు పుస్తకాల మోతను కుదించాలన్న ఆలోచన కఠినంగా అమలు చేయాల్సిన బాద్యత ప్రభుత్వాలపై ఉంది.




