Tuesday, 3 November 2026

బ్రహ్మాలకుంట గిరిజనులకు పోడుభూమి- హక్కు పత్రాలు ఇవ్వాలి…. సిపిఎం

 

 

 

 

 

పెనుబల్లి, మే 29(జనం సాక్షి)పెనుబల్లి మండలం బ్రహ్మ లకుంట గిరిజనులకు పోడు భూములకు హాక్కు పత్రాలు ఇవ్వాలని సి పి ఎం మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఎం డి ఓ, ఎం ఆర్ ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు,బ్రహ్మాలకుంట గ్రామం సంబంధించి అనేక సంవత్సరాల నుండి గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్న, ఇటీవల ఫారెస్ట్ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పోడు భూములు సర్వే నిర్వహించారు. పోడు భూములకు హక్కు పత్రాల కోసం కమిటీ వేయడం జరిగింది. ప్రతి పౌరుడు భూమి కేంద్రాల్లో కమిటీలు ద్వారా గ్రామసభలు నిర్వహించి పోటీ సాగుదారులను ఎన్నిక చేశారు, బ్రహ్మాలకుంట గ్రామంలో 32 మంది నాయకపు గిరిజనులు సాగు చేసుకున్న భూమికి పట్టాలిస్తామని గ్రామసభలో నిర్ణయం చేసి ఆమోదం చేయటం జరిగింది. కానీ అందులో నేడు 17 మందికి మాత్రమే హక్కు పత్రాలు అర్హులు అని చెప్పి, లిస్టులో వచ్చాయని చెప్పారు, ఇట్టి విషయంపై సిపిఎం పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మార్వో ఎండిఓ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి కమ్మలకుంటలోని గిరిజనుల 32 మందికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఎమ్మార్వో రమాదేవి, ఎంపీడీవో మహాలక్ష్మి మాట్లాడుతూ, పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అందరికీ పట్టాలు వచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చలమాల విట్టాలరావు మాట్లాడుతూ పేద గిరిజనులు అనేక సంవత్సరాల నుంచి పోటు సాగు చేసుకుంటున్నారని వారికి ఈ ప్రభుత్వం తక్షణమే హక్కు పత్రాలు కల్పించి బ్యాంకు వ్యవసాయ రుణాలు కలిపించాలని ఆయన డిమాండ్ చేశారు అక్కుపట్టాలు గనుక జాప్యం జరిగిన అక్కుపత్రాలు అందజేయకపోయినా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరిక చేశారు. ఈ సభలో సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, సిపిఎం మండల నాయకులు రాజనేని మంగమ్మ,, రైతు సంఘం మండల నాయకులు వెంకటేశ్వరరావు, బ్రహ్మాలకుంట గిరిజనులు రాజనేని పెద్దరాజ్యం, నల్లబోతు కృష్ణ, రాజని సరోజినీ, సీతామహాలక్ష్మి బానోతులక్ష్మి,వెంకట్ నర్సమ్మ,తదితరులు పాల్గొన్నారు.