అంబేద్కర్ విగ్రహం నుంచి ఏకలవ్వుడి విగ్రహం దాకా అడ్డంకులేఆనాడు ఎంపీని.. ఈనాడు వార్డు కౌన్సిలర్‌ను ఇబ్బంది పెట్టిండ్లు ఏకలవ్యుడి విగ్రహావిష్కరణలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్జనంసాక్షి, మంథని : బ్రాహ్మణీయ పాలనలో ఏనాటికైనా బహుజనులకు ఇబ్బందులు తప్పవని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.మంథని మండలం సూరయ్యపల్లి ఎక్స్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన ఆదివాసీ, ఎరుకల ఆరాధ్యదైవం ఏకలవ్యుడి విగ్రహాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ… 40 ఏండ్లుగా మన ఓట్లతో అధికారం చేపట్టి చెంచడు నీళ్లు పోయని, పైసా సాయం చేయని కుటుంబం మనల్ని బానిసలుగా చూస్తోందని, మరో నలుభై ఏండ్లు ఇలానే బానిసలుగా చూడాలనే ఆలోచన చేస్తున్నారని ఆయన వివరించారు. నియోజక వర్గంలో బహుజనులంతా ఏకమైతే భవిష్యత్ ఉండదని ఎమ్మెల్యే కక్ష్యకట్టి కుట్రలు చేస్తున్నాడని అన్నారు. మంథని నియోజక వర్గంలో మహనీయుల చరిత్రను చాటి చెప్పాలని ఆలోచన చేసి విగ్రహాలు పెడుతుంటే ఆ మహనీయుల చరిత్రను తెలియకూడదని, సమాజానికి చరిత్రతెలిస్తే తన భవిష్యత్ ఉండదని మహనీయుల విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటున్నాడని ఆయన తెలిపారు. తాను మహనీయుల విగ్రహాలు పెట్టి సమాజాన్నిమేల్కొల్పాలని ప్రయత్నం చేస్తుంటే నియోజక వర్గంలో తనతండ్రి చరిత్ర మాత్రమే తెలుసుకోవాలే తప్ప ఎవరి చరిత్రను తెలుసుకోవద్దని ఆలోచనతో తనను చరిత్రహీనుడిగా చిత్రీకరిస్తున్నాడని ఆయన వాపోయారు. ఈ సమాజాన్ని వాడుకుని పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే నీచ చరిత్ర తెలిసే వరకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు. 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని, విగ్రహాలను మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే పెడుతున్నాడని కొందరు అంటున్నారని, ఆనాడు మహాత్మ పూలే విగ్రహాం పెట్టామని, కాంగ్రెస్ పార్టీకి చెందిన బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా ఆయన రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలో కల్పించడంలో కృషి చేశాడనే ఆలోచనతో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన చరిత్ర తనదేనన్నారు. ఏకలవ్యుడి చరిత్ర తెలిస్తే సమాజం మేలుకుంటుందని గమనించి ఎన్ని కష్టాలు ఎదురైనా ఈనాడు విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. ఆనాడు అంబేద్కర్ విగ్రహంనుంచి మొదలు ఈనాడు ఏకలవ్వుడి విగ్రహం వరకు అనేక అడ్డంకులు సృష్టించారని, ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. మంథని ప్రధాన చౌరస్తాలో పార్లమెంట్ సభ్యురాలు దళితబిడ్డ సుగుణకుమారి బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆవిష్కరణకు రాకుండా అడ్డుకున్న చరిత్ర ప్రస్తుత ఎమ్మెల్యేదన్నారు. ఈనాడు ఎకలవ్యుడి విగ్రహం ఏర్పాటు చేస్తే వార్డు కౌన్సిలర్ కుర్ర లింగయ్యపై కేసు నమోదు చేయించాడని ఆయన గుర్తు చేశారు. ఇంత చరిత్ర ఉన్న మంథని ఎమ్మెల్యే చరిత్రకారుడా… చరిత్రహీనుడా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఈనాడు జరిగే ప్రతి విషయాన్ని చూసి మరిచిపోవడం మళ్లీ బానిసలుగా మారడం మాత్రమే నేర్చుకుంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బానిసలుగా ఉంటున్నాం కనుకనే ఈనాడు కూడా ఏకలవ్యుడి విగ్రహ ఆవిష్కరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ వాళ్ల తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని, ఏకలవ్యుడి విగ్రహం ఆవిష్కరించి చూపించానన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నఎస్సీ సామాజిక వర్గం నాయకులు సైతం అక్కడక్కడ విగ్రహాలు ఏర్పాటు చేశారని, అన్నారం, రుద్రారంలో విగ్రహాన్నిఆవిష్కరించారే కానీ శిలాఫలాలు లేవని, గౌరవం ఉండదన్నారు. కానీ ఏకలవ్యుడి విగ్రహం పెట్టి శిలాఫలకం ఏర్పాటు చేసుకుని ఎలా గౌరవించు కుంటున్నామో చూడాలన్నారు. నియోజకవర్గంలో తండ్రి విగ్రహాలు పెట్టి తండ్రి చరిత్రను తెలుసుకోవాలని అంటున్న ఎమ్మెల్యే తండ్రి చరిత్ర ఏంటో చెప్పాలన్నారు. ఎక్కడైనా చెరువు పోయించిండా లేక బ్రిడ్జి కట్టించిండా ప్యాక్టరీ పెట్టిండా వంద మందికి ఇండ్లుకట్టించిండా అని ప్రశ్నించారు. ఎందుకు తండ్రి విగ్రహాలు పెట్టాడో అడిగితే సమాధానం చెప్పకుండా తాను పెట్టే విగ్రహాలను మాత్రం అడ్డుకుంటున్నాడని విమర్శించారు. విగ్రహాలు వెలిసి చరిత్ర తెలిస్తే చెంచాడు నీళ్లు పోయని నా కుటుంబాన్ని ఇక ఊర్లోకి రానీయకుండా తరిమికొడతారని భావించే కక్ష్యసాధింపు చర్యలకు పూనుకున్నాడని అన్నారు. తాను జ్యోతిరావు పూలే, చాకలి ఐలమ్మ, సర్థార్ సర్వాయి పాపన్న విగ్రహాలు పెట్టి ముందకు వెళ్తుంటే ఇదే సమాజాన్ని వాడుకొని మంథని మధుకర్, రేవల్లి రాజబాబు, శీలం రంగం చావులను వాడుకొని ఇదే సమాజానికి దూరం చేసిండని అన్నారు. పూలేను ప్రేమిస్తే బహుజనులు బీసీలు ఏకమైతే పుట్ట గతులుండవని, బాబు జగ్జీవన్ రాం గురించి తెలుసుకుని మాదిగలంతా ఒక్క తాటిమీదకు వస్తే చరిత్ర ఉండదని, చాకలి ఐలమ్మ గురించి తెలుసుకొని చాకలి సామాజిక వర్గం ఏకమైతే తనకు చరిత్ర ఉండదని 300 సంవత్సరాల క్రితమే గౌడ్ లకు ఒక దిక్చూచిగా నిలబడి గోల్కొండ ఖిలాను ఏలిన సర్వాయి పాపన్న గురించి తెలిసి గౌడ్ లు ఒకటైతే చరిత్ర ఉండదని కక్షగట్టిన ఎమ్మెల్యే ఈ సమాజాన్ని విచ్చిన్నం చేసి సమాజాన్ని ఒక దగ్గర కలవకుండా చేసిండని, 40 ఏండ్ల బానిసత్వాన్ని మరో40 ఏండ్లు ఉంచడానికి కంకణంకట్టుకున్నాడని, ఈనాడు ఎమ్మెల్యే వెంట తిరిగే బహుజనులంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రాహ్మణీయ పాలన సమాజంలో ఎవరిని గౌరవించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బహుజనుల గురించి ఆలోచన చేస్తూ వారు బాగుపడాలని ఆకాంక్షించే తమపై కక్ష్యపెంచుకుని అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ అంబేద్కర్ విగ్రహంపెడితే ఎమ్మెల్యేగా విగ్రహా ఆవిష్కరణను అడ్డుకున్నాడని, ఈనాడు సైతం అదే అహంకార పూరితంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నాడని అన్నారు. కమాన్‌పూర్ మండలంలోని ఆదివరహస్వామి ఆలయానికి వెళ్లే రహదారి నిర్మాణం చేస్తే దానిని అడ్డుకునే ప్రయత్నం చేసిండని ఆయన గుర్తు చేశారు. తాను ఏ పనిచేసినా పేదోడి ఆత్మగౌరవం నిలబడటానికే చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరు చరిత్ర తెలుసుకోవాలని, ఆ చరిత్రను పది మందికిచెప్పాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.
బ్రాహ్మణీయ పాలనలో బహుజనులకు ఇబ్బంది తప్పదు..




