బ్రాహ్మణులను జగన్‌ అవమానపర్చారు

13 జిల్లాల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తాం
రాష్ట్ర బ్రాహ్మణ సంఘం  సమాఖ్య ప్రతినిధులు
రాజమండ్రి, జూన్‌13(జ‌నం సాక్షి) : నగరంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సభకు రాకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తమను అవమానపరిచారని రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులు మండిపడుతున్నారు. జగన్‌ వస్తారన్న వైసీపీ నేతల భరోసాతోనే ఏర్పాట్లు చేసుకున్నామని, సభ కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు తరలి వచ్చారని బ్రాహ్మణ సంఘాలు చెబుతున్నాయి. ప్రజాసంకల్ప యాత్రంలో భాగంగా జగన్‌ రాజమండ్రిలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయసభకు హాజరవుతారని వైసీపీ నేతలు హావిూ ఇచ్చారు. దాంతో ఈ సభ కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే జగన్‌ మాత్రం హాజరు కాకుండా తన జాతిని అవమానపరిచారని బ్రాహ్మణ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.బ్రాహ్మణులకు జరిగిన అవమానంపై రాష్ట్ర నేతలంతా రాజమండ్రిలోని ఓ ¬టల్‌లో బుధవారం అత్యవసర సమావేశం అయ్యారు. జగన్‌ అవమానించిన తీరు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించకపోతే రెండు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని, వైసీపికి వ్యతిరేకంగా పనిచేస్తామని అన్నారు. జగన్‌తోపాటు వైసీపీ నేతలను బహిష్కరిస్తామని అన్నారు. త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రంలో జగన్‌ చేసిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తామని బ్రాహ్మణ సంఘం నేతలు పేక్కొన్నారు.