Tuesday, 3 November 2026

హరితహారం కార్యక్రమం జిల్లాలో లక్ష్యం ప్రకారం మొక్కలు నాటాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జులై 3 (జనం సాక్షి);రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం జిల్లాలో లక్ష్యం ప్రకారం మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా ఐ డి ఓ సి సమావేశము హాలు నందు హరితహారం కార్యక్రమం పై జిల్లా అధికారులతో సమీక్షించారు. హరితహారం లో మొక్కలు నాటడానికి ప్లాన్ తయారు చేయాలనీ, హరితహారం కింద మొక్కలు ఎక్కడ, ఎన్ని మొక్కలు, నాటుతారో స్థలాన్ని గుర్తించి ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని,స్థలాలు గుర్తించి, ప్రొటెక్షన్ ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుందన్నారు.వర్షా కాలం ఉన్నందున అన్ని శాఖలు జిల్లా కు ఉన్న లక్ష్యం ప్రకారం త్వరిత గత్తిన ప్లాన్ చేసుకొని ఈ నెల చివరి నాటికీ పూర్తి చేయాలన్నారు. హరితహారం క్రింద నాటిన ప్రతి మొక్కకు జియో టాకింగ్ చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి శాఖ కు ఉన్న లక్ష్యము ప్రకారం మొక్కలు నాతెందుకు సిద్దంగా ఉండాలని, శాఖ ల వారీగా అడిగి తెలుసు కున్నారు. మున్సిపాలిటీలలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు జులై చివరి నాటికి నాటాలని ఆదేశించారు. పట్టణాలలో రోడ్లు, పార్కులు, కార్యాలయాలు, ఇల్లు తదితర ప్రాంతాలలో మొక్కలు విరివిగా నాటాలని ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొక్కలు వెంటనే నాటుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహన్, ఆర్ డి ఓ రాములు, ఫారెస్ట్ అధికారి నవీన్ రెడ్డి, జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.