భక్తిశ్రద్ధలతో హనుమాన్ కార్తికపూజలు, దీపారాధనలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 1(జనంసాక్షి):
కార్తీక మాసంలో మొదటి మంగళవారం ఆంజనేయ మాల ధారణ స్వాములు మంగళవారం నాడు రాంనగర్ కాలనీలో గల శ్రీసీతారామస్వామి దేవాలయంలో సింధూర లేపనం, పంచామృతషేకం వైభవంగా నిర్వహించడం జరిందని దీక్ష గురు స్వామి వారిది శ్రీను తెలిపారు. హనుమాన్ స్వాములు శ్రీకాంత్ ,సతీష్, తిరుపతి, నందు, గిరి యాదవ్, శేఖర్ , నరేష్ ,మధు హనుమాన్ దీక్ష స్వాములు తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ దేవాలయంలో :
కేసరి సముద్రం పక్కనగల హనుమాన్ దేవాలయంలో కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజు రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ప్రత్యేకంగా కార్తిక పూజలు, భజనలు జరుగుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వై. రాజేశ్వర శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో ఎలిమే ఈశ్వరయ్య, జంగిటి బుచ్చన్న, వెంకటేశ్వరరావు, తిమ్మాజీపేట రాములు, పాండు, ఇందిరా, జగన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు
రామాలయంలో మహిళలచే దీపదానలు:
కార్తీక మాసంలో నిష్ఠగల బ్రాహ్మణులకు దీపదానం, వస్త్ర దానం చేయడం,ఫలదానం , సాలగ్రామ దానాలు ఎంతో పుణ్య పలితాన్ని ఇస్తాయని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ అన్నారు. మంగళవారం రామాలయంలో మహిళా భక్తులు బ్రాహ్మణునికి వస్త్ర దానం కార్తీక దీప దానాలు భక్తిశ్రద్ధలతో పాల్గొని అందజేశారు. అనంతరం ఆలయంలో ఆకాశదీపోత్సవం సామూహిక దీపారాధన కార్యక్రమాలు వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




