Monday, 2 November 2026

భగలాముఖీని దర్శించుకున్న మాజీ బార్ కౌన్సిల్ చైర్మన్ రాజేందర్ రెడ్డి

శివ్వంపేట జూన్ 29 జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామంలో గత ఐదు నెలల క్రితం దేదీప్యమానంగా కొలువై, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా రూపాంతరం చెందిన భగలాముఖి శక్తిపీఠంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు బార్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసిన ఎం. రాజేందర్ రెడ్డి బుధవారం రాత్రి బగలాముఖి శక్తిపీఠానికి వచ్చి పీఠంలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి అమ్మవారికి విశేష అభిషేకాలు, హరిద్రార్చన వంటి పూజలు చేపట్టారు. ఆ తర్వాత అమ్మవారి మూల మంత్రాలతో కూడిన శాలువాను భగలాముఖి ట్రస్ట్ చైర్మన్, అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ రాజేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల భగలాముఖి అమ్మవారి వీడియో చూసి తన మనస్సులో అమ్మవారిని స్మరించుకోగానే తన కోరిక ఫలించి విజయం సాధించినందున అమ్మవారి దర్శనం ఆరోజు ఇక్కడికి వచ్చి భగలాముఖి అమ్మవారి దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. బగలాముఖి శక్తిపీఠానికి గతంలో 30 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించనని, తొలి విడతగా ఈ రోజు 5 లక్షల రూపాయలు అమ్మవారికి సమర్పించారు. భగలాముఖి శక్తిపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున సభ్యులు అందరూ ఈ రాజేందర్ రెడ్డి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు, అభినందనలు తెలియజేసి అమ్మవారి దీవెనలు ఎప్పటికీ ఉంటాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భగలాముఖి ట్రస్ట్ చైర్మన్ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, సభ్యులుజిన్నారం పెద్ద గౌని శివకుమార్ గౌడ్,పబ్బా మహేశ్ గుప్తా,శాస్త్రుల పురిషోత్తమ శర్మ,
మారుమూల వెంకటరమణ శర్మ,పత్రాల శ్రీనివాస్ లతోపాటు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.