భర్త మృతితో భార్య ఆత్మహత్య
రాజంపేట్ జనవరి 10 జనంసాక్షి
మండల కేంద్రానికి చెందిన మెత్తల అశోక్ గత 21 రోజుల క్రితం చనిపోవడంతో ఆయన భార్య భార్గవి అతని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం… భార్గవి భర్త అశోక్ గత 21 రోజుల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోగా భర్త మృతిని తట్టుకోలేక మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిందని ఆయన తెలిపారు. ఇది గమనించిన ఆమె తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు పేర్కొన్నారు అని ఆయన తెలిపారు. భార్గవికి మూడు సంవత్సరాల పాప, సంవత్సరం బాబు ఉన్నట్టు ఆయన తెలిపారు. దీనిపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు పేర్కొన్నారు.




