యువకులు క్రీడల్లో స్నేహభావం పెంచాలి
ఎస్సై తోట మహేందర్
జనం సాక్షి, చెన్న రావు పేట
సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఉప్పరపల్లి గ్రామ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి ఆటలు పోటీలు నిర్వహిస్తున్నట్టు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై తోట మహేందర్ ను ఉప్పరపల్లి గ్రామ యువకులు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎస్సై తోట మహేందర్ మాట్లాడుతూ క్రీడలలో స్నేహభావం పెంచాలని,క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు,క్రీడల్లో నైపుణ్యం పెంచడం కోసం ఆటల పోటీలు ఎంత ఉపయోగపడుతున్నాయని అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ సైనికుడు చింతకింది శివకృష్ణ ,పరికి మధుకర్, పులి రాజ్ కుమార్, ఏనుగుతల నరేష్, తాటికొండ కోటి, పోగుల అశోక్, బొమ్మెర సతీష్, కుక్కల అజయ్త తదితరులు పాల్గొన్నారు.




