Wednesday, 4 November 2026

శ్రీలక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న శాసనసభ చిత్రం హీరో

శ్రీలక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న శాసనసభ చిత్రం హీరో
జైనథ్ జనం సాక్షి డిసెంబర్ 3
జైనథ్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నీ శాసనసభ చిత్రం హీరో ఇంద్రసేన దర్శించుకున్నారు రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా అదిలాబాదుకు చేరుకున్న హీరో ఇంద్రసేన శనివారం ఉదయం జైనథ్ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు ఆలయానికి వచ్చిన హీరోకు అర్చకులతో పాటు ఎంపీపీ గోవర్ధన్ ఆలయా అభిమానులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు రైతు సమతి మండల అధ్యక్షులు సరసం లింగరెడ్డి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పుండ్రు వెంకట్ రెడ్డి హీరోని శాలువా పూలమాలతో సన్మానించారు ఈ సందర్భంగా హీరో ఇంద్రసేన మాట్లాడుతూ తాను నటించిన శాసనసభ చిత్రం విజయవంతం కావాలని దేవుని వేడుకోవడం జరిగిందన్నారు ఈ పురాతన ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు అయిన వెంట అదిలాబాద్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కాళ్ల విట్టల్ బండారి దేవన్న తదిరులు పాల్గొన్నారు