Wednesday, 4 November 2026

రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయాలి

రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయాలిరాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయాలి
–  బెజవాడ వెంకటేశ్వర్లు
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 7న నిర్వహించనున్న రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మబిక్షం భవనంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.జిల్లా నుండి పార్టీ , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 500 మంది నాయకులు, కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడిలో పాల్గొనాలని అన్నారు.బ్రిటిష్ కాలంలో ఉన్న ఈ గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య పాలనలో రాష్ట్ర ప్రభుత్వ జీఓల అమలుకు అడ్డంకిగా మారిందని అన్నారు.కేంద్ర ప్రభుత్వ పాలకుల చేతిలో కీలు బొమ్మలుగా మారిన గవర్నర్ వ్యవస్థ వారి ఆదేశానుసారం బిజెపి వ్యతిరేక ప్రభుత్వాలను ఇబ్బందులను గురి చేస్తూ, ప్రభుత్వం కూల్చటానికి ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు.గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని జరుగుతున్న ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి, పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అనంతుల మల్లేశ్వరి , రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ , పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు , ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు చిలక రాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.