Wednesday, 4 November 2026

భవిష్యత్తు లో మరింత ఉన్నతంగా ఎదగాలి.

 

 

 

 

 

 

 

ఎస్పీ అఖిల్ మహాజన్.వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అభినందనలు.సిరిసిల్ల. ఫిబ్రవరి 10.(జనం సాక్షి) విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులను అభినందించారు. శాతవాహన విశ్వవిద్యాలయం మూడవ ,ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. తిక్కల్ దేవి అఖిల, కుసుమ మాళవిక, సాత్విక, ప్రవల్లిక ,సోనీ, శ్రీ వాణి, అక్షయ, పాటు అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థినులకు ప్రశంస పత్రాలు అందజేశారు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు దిడ్డి శ్రీనివాస్, గుగ్గిళ్ళ జగన్ గౌడ్ అధ్యాపకులు పాల్గొన్నారు.