Wednesday, 4 November 2026

భాజపా కార్యాలయం ముట్టడికి యువజన కాంగ్రెస్‌ యత్నం

న్యూఢిల్లీ : భాజపా కార్యాలయం ముట్టడికి యువజన కాంగ్రెస్‌ నేతలు యత్నించారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు భాజపా ఆత్మవిమర్శ చేసుకోవాలని అద్దాలతో ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగిస్తూ కార్యాలయం వైపు కార్యకర్తలు దూసుకువెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జల ఫిరంగులను ప్రయోగించి ఆందోళనకారులను పోలీసులు చెదరగొడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *