Tuesday, 3 November 2026

భాజపా రెండో జాబితా విడుదల

–  28మంది పేర్లతో జాబితా విడుదల
హైదరాబాద్‌, నవంబర్‌2(జ‌నంసాక్షి) : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం రాత్రి వరకు అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. ఈ సమావేశంలో లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, రామచంద్రరావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని భాజపా గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 20న 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా.. శుక్రవారం తాజాగా 28 మందితో రెండో జాబితా విడుదల చేసింది.
అభ్యర్ధులు వీరే..
సిర్పూర్‌-డా.శ్రీనివాసులు, సిఫాబాద్‌-అజ్మీరా ఆత్మరామ్‌నాయక్‌, ఖానాపూర్‌-సట్ల అశోక్‌ , నిర్మల్‌-డా. సువర్ణారెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌- యెండల లక్ష్మీనారాయణ, జగిత్యాల-ముదుగంటి రవీందర్‌రెడ్డి, రామగుండం-బల్మూరి వనిత, సిరిసిల్ల-నర్సాగౌడ్‌, సిద్దిపేట-నాయిని నరోత్తమ్‌రెడ్డి, కూకట్‌పల్లి-మాధవరం కాంతారావు, రాజేంద్రనగర్‌-బద్దం బాల్‌రెడ్డి, శేరిలింగంపల్లి-జి. యోగానంద్‌, మలక్‌పేట్‌-ఆలె జితేంద్ర, చార్మినార్‌-టి.ఉమామహేంద్ర, చాంద్రాయణగుట్ట-సయ్యద్‌ సహేజాది, యాకత్‌పురా-చర్మాని రూపరాజ్‌, బహదూర్‌పురా-అనీఫ్‌అలీ, దేవరకద్ర-అగ్గాని నరసింహులుసాగర్‌, వనపర్తి-కొత్త అమరేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌-నేదనూరి దిలీప్‌చారి, నాగార్జునసాగర్‌-కంకణాల నివేదిత, ఆలేరు-దొంతిరి శ్రీధర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌-పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, వరంగల్‌ వెస్ట్‌- ఎం.ధర్మారావు, వర్దన్నపేట-కొత్త సారంగరావు, ఇల్లందు-ఎం.నాగస్రవంతి, వైరా-భూక్య రేష్మాబాయి, అశ్వారావుపేట-డా.భూక్య ప్రసాదరావు